
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదివారం, 2004-05 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బముగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని, అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యా బుద్దులు నేర్పిన గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎండీ మిస్కిన్, శశికుమార్, శ్రీనివాస్, శకుంతల, రమాదేవి, పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.