
అనంతరం పబ్బు రాజు గౌడ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి కుటుంబానికి, ప్రతి ఓటరుకు వివరించి చెప్పాలని, మన గ్రామంలో అభివృద్ధి జరిగింది అంటే అది మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో ఈ మధ్య కాలంలో కరెంటు గాని, సిసి రోడ్లు గాని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను గురించి కార్యకర్తలకు వివరించి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేద ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికే అవకాశం ఉంటుందని అన్నారు. మన పార్టీ చేపట్టిన రైతు రుణమాఫీ, గృహ జ్యోతి, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, గ్యాస్ సబ్సిడీ మరియు ఈ మధ్యకాలంలో మన గ్రామానికి ప్రతిరోజు చౌటుప్పల్ నుండి వయ మల్కాపురం గ్రామం గుండా బస్సులు దిల్సుఖ్నగర్ కు వేయడం జరిగింది. ఇట్టి సదవకాశాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకునే విధంగా కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని కోరడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్, వార్డు సభ్యులను అన్నింటిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మల్కాజిగిరి బాబు, ఆందోల్ మైసమ్మ దేవాలయం కమిటీ చైర్మన్ చిలుకూరి మల్లారెడ్డి, ఈడుదుల హరి ప్రసాద్, రామస్వామి లచ్చిరెడ్డి, అంజాత్ ఖాన్, మరియు దేవాలయ కమిటీ డైరెక్టర్లు, గ్రామ శాఖ కార్యవర్గం, మాజీ వార్డ్ మెంబర్లు, నాయకులు అత్యధిక సంఖ్యలు పాల్గొన్నారు.