
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామ భవన నిర్మాణ సుతారి సంఘం కార్మికుల ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ నెల ఫిబ్రవరి 21న జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాడారి రాములు మాట్లాడుతూ మహాసభ మహాలక్ష్మి వీధిలోని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో జరుగుతుందని అన్నారు. ఈ మహాసభను భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సెంట్రింగ్, సుతారి, ఫ్లoబర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మార్బుల్, అన్ని రకాల బిల్డింగ్ రంగ కార్మికులు ఈ మహాసభను జయప్రదం చేయాలని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను ఎత్తివేసి,4 కోడ్ లుగా విభజించి కార్మికుల పొట్టలు కొట్టిందని, బి ఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత థంబ్ సిస్టం తీసుకువచ్చి కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, థంబ్ సిస్టం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు నిండిన కార్మికులకు 5 వేల పెన్షన్ ఇవ్వాలని,సహజ మరణానికి 5 లక్షలు, ఆక్సిడెంట్ కు 10 లక్షలు, మ్యారేజ్ 1 లక్ష, డెలివరీ 50 వేలు కార్మికులకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చీర్లవoచ సుతారి సంఘం అధ్యక్షులు మెతుకు. లచ్చయ్య, గుంట. అంజయ్య, మె తుకు. మల్లేశం, రామస్వామి, రాములు, నాగరాజు, మచ్చ. మల్లేశం, నర్సయ్య, మోహన్, వెంకటేశం , శ్రీనివాస్, రవీందర్, రామయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.