క్రికెట్ పోటీలను ప్రారంభించిన తాజా మాజీ ఎంపీపీ 

– మర్కోడు యువత ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ 
– ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి
– కోండ్రు మంజు భార్గవి 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎం.పి.ఎల్ సీజన్ – 2 క్రికెట్ పోటీలను స్థానిక మాజీ ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ క్రికెట్ పోటీలలో విజయం సాధించిన విజేతలకు ప్రథమ బహుమతి రూ.16000/-లు వూకె కిషోర్ బాబు – కోండ్రు మంజు భార్గవి(మాజీ ఎంపీపీ) దంపతులు, రెండవ బహుమతి రూ.10000/-లు  కాంగ్రెస్ పార్టీ నాయకులు సుతారి కృష్ణ అందజేయనున్నారని టోర్నీ నిర్వాహకులు తాళ్లపల్లి శేఖర్, ఏడుళ్ల నాగేష్ తెలిపారు. ఈ సందర్భంగా తాజా మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. పోటీలు క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందిస్తాయని చెప్పారు. క్రికెట్ టోర్నమెంట్ లో ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వాహకులు అవాంచనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేయాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వగలబోయిన సతీష్, టోర్నమెంట్ నిర్వాహకులు వినయ్, నాగేష్, క్రీడాకారులు, ఔత్సాహికులు పాల్గొన్నారు.