ప్రశాంతంగా డీబీహెచ్ పీఎస్ పరీక్షలు…

నవతెలంగాణ – అశ్వారావుపేట
దక్షిణ భారత హిందీ ప్రచార సభ,హైదరాబాద్ వారి ఆధ్వర్యం లో నిర్వహించిన హిందీ భాషా సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ప్రశాంతంగా జరిగినాయి.
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మున్సిపాల్టీలో గల ఏ – వన్ కిడ్స్ స్కూల్ లో ఆదివారం జరిగిన పరీక్షా కేంద్రం లో హిందీ ప్రాథమిక, హిందీ మాధ్యమిక,హిందీ రాష్ట్రీయ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహించారు.వివిధ పాఠశాలల నుండి మొత్తం నలభై మంది విద్యార్దులు హాజరు అయ్యారు. ఈ పరీక్షలు ఉదయం 09:00 గంటల నుండి, సాయంత్రం 04:30 వరకు జరిగినాయి. ప్రాథమిక కోర్సు పరీక్షలు మాత్రం కేవలం ఉదయం ఒక పూట, మాధ్యమిక, రాష్ట్రీయ కోర్సు పరీక్షలు ఉదయం, సాయంత్రం జరిగినవి.ఇక్కడ ఈ పాఠశాలలో యు కె జి నుండే హిందీ వర్ణమాల నేర్పు తున్నాం అని,అందువల్ల విద్యార్థులకు హిందీ భాషా సులభంగా చదవడం, రాయడం బాగా అలవాటు ఐనది అని, అందుకే ఈ పరీక్షలు గత ఆరు సంవత్సరాలుగా, ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి లో నిర్వహిస్తామని ప్రధానోపాధ్యాయులు రాధ అన్నారు.కనుక ఈ అవకాశాన్ని విద్యార్దులు ఉపయోగించుకోవాలని కోరారు.