16న ముగ్గురు కవుల సప్తతి సభలు
తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు, తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు హైదరాబాదులోని రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ‘కందుకూరి శ్రీరాములు, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, డాక్టర్ నాళేశ్వరం శంకరం’ ముగ్గురు కవుల సప్తతి సభ నిర్వహిస్తున్నారు. డా. కొండపల్లి నీహారిణి ఆహ్వానంలో బైస దేవదాసు సభాధ్యక్షన దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, మామిడి హరికృష్ణ, దేవీ ప్రసాద్, విరాహత్ అలీ విశిష్ట అతిథులుగా ప్రారంభ సమావేశం ఉంటుంది. అనంతరం ముగ్గురు కవుల సభలు ఉంటాయి.
23న దాశరథి – ఆరుద్ర సాహిత్య సమాలోచన
దాశరథి కష్ణమాచార్య – ఆరుద్ర శతజయంతి సందర్భంగా తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ఈ నెల 23 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దాశరథి కష్ణమాచార్య – ఆరుద్ర సాహిత్య సమాలోచన సదస్సు ఉంటుంది. ప్రముఖుల ప్రసంగాలు, పరిశోధకుల పత్ర సమర్పణలు ఉంటాయి. వివరాలకు 8897765417, 6304078905 నంబర్ల నందు సంప్రదించవచ్చు.
– తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ
విశిష్టాద్వైత సాహిత్య గ్రంథాలకు ఆహ్వానం
శ్రీలేఖ సాహితి ఆధ్వర్యంలో విశిష్టాద్వైత సాహిత్య గ్రంథాలకు ‘చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక సాహిత్య పురస్కారం’ అందివ్వనున్నారు. ఎంపికైన సంకలనానికి రూ.5000/- బహుమతి అందిస్తారు. ఇందుకు పద్య కావ్యాలు, వ్యాస సంపుటాలు పంపవచ్చును. ఆసక్తి కలిగిన వారు 2020 – 24 మధ్య కాలంలో ప్రచురితమైన సంకలనాలను మార్చి 31 లోగా డాక్టర్ టి. శ్రీరంగస్వామి, అధ్యక్షులు, శ్రీలేఖ సాహితి, ఇం.నం. 27-14-53, లిటిల్ సోల్జర్స్ స్కూల్ లేన్, మండల కార్యాలయం ఎదురుగా, హసన్‌పర్తి 506371,
హన్మకొండ, వరంగల్ చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 99498 57955 నందు సంప్రదించవచ్చు.
కథా సంపుటాల కు ఆహ్వానం..
వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో కథా సంపుటాలకు పురస్కారాలను అందివ్వనున్నారు. ఆసక్తి కలిగిన వారు 2023, 2024 లో ప్రచురించిన కథా సంపుటాలను నాలుగు ప్రతుల చొప్పున మార్చి 31లోగా పి.యాదగిరి, ఇం.నెం.17-3-86/35, జ్యోతి నిలయం, వినాయక్ నగర్ రోడ్-2, మయూరి బార్ అండ్ రెస్టారెంట్ ఎదురు వీధి, రంగధాంపల్లి చౌరస్తా దగ్గర, సిద్ధిపేట – 502103 చిరునామాకు పంపవచ్చు. ఎంపికైన వాటికి సిద్దిపేటలో నిర్వహించే సాహిత్య కార్యక్రమంలో పుసరస్కారం అందజేస్తారు. వివరాలకు 9299909516, 9848261284 నంబర్ల నందు సంప్రదించవచ్చు.