ప్రేమికుల రోజు కానుకగా రిలీజ్‌

Released as a Valentine's Day giftహీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్‌ కామెడీ మూవీ ‘కష్ణ అండ్‌ హిజ్‌ లీల’. కరోనా సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. రవికాంత్‌ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజరు రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రాన్ని ‘ఇట్స్‌ కాంప్లికేటెడ్‌’ అనే టైటిల్‌తోపాటు కొత్త ట్విస్ట్‌తో ఈనెల 14న ప్రేమికుల రోజు కానుకగా రిలీజ్‌ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ,’ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాని థియేటర్స్‌కి తీసుకొస్తే బాగుంటుందనిపించింది. రానాకు చెబితే తక్కువ సమయంలోనే రిలీజ్‌ ప్లాన్‌ చేశారు’ అని తెలిపారు. ‘ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కాంప్లికేషన్‌ ఉంటుంది. నా జీవితంలో డైరెక్టర్‌ రవికాంత్‌, తర్వాత సిద్దు కాంప్లికేటెడ్‌(నవ్వుతూ). రవికాంత్‌ చెప్పిన కథ మనసుకు చాలా దగ్గరగా ఉంది. అందరి జీవితంలో అది జరుగుతుంది. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఈ సినిమాని థియేటర్స్‌లో రిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓటీటీలో మాదిరిగానే థియేటర్లలో కూడా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని హీరో రానా దగ్గుబాటి చెప్పారు.