తెలంగాణ డబుల్‌ ధమాకా

Telangana is a double whammy– జాతీయ క్రీడల్లో రెండు కాంస్య పతకాలు
డెహ్రాడూన్‌ : 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ అథ్లెట్లు పతక వేటలో సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన పోటీల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు దక్కాయి. మహిళల నెట్‌బాల్‌ (ట్రెడిషనల్‌) కాంస్య పతక మ్యాచ్‌లో ఉత్తరాఖాండ్‌, తెలంగాణ 42-42తో సమవుజ్జీగా నిలిచాయి. మ్యాచ్‌ టైగా ముగియంతో ఆతిథ్య జట్టుతో కలిసి తెలంగాణ కాంస్య పతకాన్ని పంచుకుంది. మహిళల 4,400 రిలే పరుగులో మన స్పింటర్లు కాంస్య పతకం సాధించారు. తెలంగాణ అథ్లెట్లు నందిని అగసార, నిత్య, సింధు, మైతిలి 47.58 సెకండ్లలో రిలే రేసును ముగించారు. ఈ విభాగంలో తెలంగాణకు ఇదే తొలి మెడల్‌. కర్ణాటక అమ్మాయిలు పసిడి, కేరళ అమ్మాయిలు సిల్వర్‌ మెడల్స్‌ దక్కించుకున్నారు.