కార్మికులందరికీ ఉద్యోగా భద్రత కల్పించాలి

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీవో కార్యాలయం ముందు ఆదివారం గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 4వ రోజు సమ్మెకు సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు కొంపల్లి భాస్కర్ సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు కొంపల్లి భాస్కర్  మాట్లాడుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల వెంటనే పరిష్కరించి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి కార్మికులందరికీ ఉద్యోగా భద్రత కల్పించాలని కోరారు.కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారులచే కార్మికులను బెదిరింపులకు పాల్పడే విధానాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.