గల్ఫ్ బాధితుడు అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

నవతెలంగాణ- రామారెడ్డి
గల్ఫ్ లో మృతి చెందిన ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పురం సిద్ధిరాములు మృతదేహం ఆదివారం గ్రామానికి చేరుకోగా, గ్రామస్తులంతా కలిసి అంత్యక్రియలకు రూ 30000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామ సర్పంచ్ కొత్తొల్ల గంగారం, రైతుబంధు అధ్యక్షులు నారాయణరెడ్డి, మృతదేహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. అంత్యక్రియలో పాల్గొని, శవపేటికను మోశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పరవా రెడ్డి, ఆకుల లింగం, పల్లె నర్సింలు, ఎల్లయ్య, ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు.