నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్‌లో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న స్వచ్ఛ వాహనాలపై బాల కార్మికులు పనిచేస్తున్నారు. శంషాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి రాల్లగూడ వరకు చెత్త సేకరణ చేసే స్వచ్ఛ వాహనాలపై బాల కార్మికులు గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఈ విషయంపై సంబం ధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదని స్థానికు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని ఒకవైపు ప్రచారాలు చేస్తూ మరోవైపు ప్రభుత్వ స్వచ్ఛ వాహనాలపైనే బాల కార్మికులు పని చేస్తున్నారంటే శంషాబాద్ మున్సిపల్ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టం అవుతున్నది.