ఉచిత హామీలతో నట్టేట ముంచుతున్న బీఆర్‌ఎస్‌

– ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బి.గుల్షన్‌
నవతెలంగాణ-కొడంగల్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పే ఉచిత హామీలతో, మభ్య పెట్టే మాటలతో ప్రజలు విసుకు చెందారన్ని ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బి గుల్షన్‌ అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం మైనార్టీలకు కార్పొరేషన్‌ రుణాలు అందిస్తామని చెప్ప డంతో నిరుపేద మైనార్టీ ప్రజలు మీసేవా కేంద్రాల్లో డబ్బులు వెచ్చించి దరఖాస్తులు చేసుకున్న ఫలితం లే కుండా పోతుందన్నారు. మైనార్టీ కార్పొరేషన్‌ రుణాలను అందిస్తామని చెప్పడంతో మీసేవా కేంద్రాల చుట్టూ తిరిగి డబ్బు ఖర్చు చేసి దరఖాస్తులు చేసుకున్న నేటి వరకు అందించకపోవడం దారుణమని అన్నారు. మై నార్టీ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్న ప్రభుత్వం కాగితాలకు ప్రకటనలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదన్నా రు. ఓట్లను దండుకోవడం కోసం మైనార్టీ ప్రజలను కేవ లం సంతోష పెట్టేందుకు కార్పొరేషన్‌ రుణాలను అందిస్తా మని చెప్పడం సమంజసం కాదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభు త్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నా రు. కార్యక్రమంలో షేక్‌ రోమన్‌, ఎండీ.మూర్తజా, హుసే న్‌, షేక్‌ ఆబీద్‌, సయ్యద్‌ ముస్తఫా, ఎండీ.అజర్‌, ఎండీ. ముబీన్‌, ఎండీ.అర్షద్‌, ఎండీ.ఏజాజ్‌, ఎండీ.జఫర్‌, రమేశ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.