కాంగ్రెస్‌ గెలుపుతోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యం

– జోడోయాత్రలో ఇంటింటి ప్రచారం కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కృష్ణారెడ్డి
నవతెలంగాణ-గండిపేట్‌
కాంగ్రెస్‌ గెలుపుతో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమని బండ్లగూడ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం గండిపేట్‌ మండలం బండ్లగూడలో జోడో యాత్రల్లో భాగంగా జ్ఞానేశ్వర్‌ ముదిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. రాజేంద్రనగర్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్‌ తరుపున జ్ఞానేశ్వర్‌ ముదిరాజును గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతు భరోసా పథకం, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి 15 వేలు చెల్లిస్తామన్నారు. నష్టపోయిన రైతులకు వేంటనే పరిహారం చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో ఎ బ్లాక్‌ అధ్యక్షులు డప్పు నవీణ్‌కుమార్‌, ఉపాధ్యక్షులు ప్రేంకుమార్‌, నాయకులు ప్రవీణ్‌ముదిరాజు, రమేష్‌యాదవ్‌, బొర్ర శ్రీనివాస్‌, పానుగంటి గోపాల్‌మూదిరాజు, కుమార్‌యాదవ్‌, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌ముదిరాజు, గంగని రవికుమార్‌, లక్ష్మన్‌, యాదయ్య, బుచ్చన్న, కట్టజగన్‌చ సుభాన్‌, ప్రకాష్‌, బాస్కర్‌, చందు, అజరు తదితరులు పాల్గొన్నారు.