– పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి
– ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్
– కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన ఏఐటీయూసీ
నవతెలంగాణ-యాచారం
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. సోమవారం యాచారం ఎంపీడీవో ఆఫీస్ ఎదుట చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మెకు ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు అతి తక్కువ జీతాలు ఇస్తూ ప్రభుత్వం వారితో వెట్టి చాకిరి చేయిస్తుందని విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. వారి సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలీచాలని జీవితాలతో కార్మికుల కుటుంబాలు గడవక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కార్మికు లందరికీ రూ.19,500 కనీస వేతనం అమలు చేయాలని యూసఫ్ డిమాండ్ చేశారు. అదేవిధంగా మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో నిత్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర విధాలుగా ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా కార్మిక న్యాయకత్వాన్ని చర్చలకు పిలిచి సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య, నాయకులు మస్కు సంజీవ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.