రిచ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఉచిత గుండె వైద్య శిబిరం విజయవంతం

నవతెలంగాణ –  సిద్దిపేట
పట్టణంలోని రిచ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 0-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్స్ డాక్టర్లు  రవితేజ గౌడ్,  సంతోష్ కుమార్ తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ కిమ్స్ సన్ షైన్ సికింద్రాబాద్ ఆస్పత్రికి చెందిన పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, ఇంటర్ వెన్షనల్ కార్డియాలిజిస్ట వైద్యులు డీ.లింగస్వామి వ్యాధి గ్రస్థులకు 2డి ఈకో పరీక్ష ఉచితంగా చేస్తూ, వ్యాధిని బట్టి సలహాలను, సూచనలను తెలియజేయడం జరిగిందని తెలిపారు. సిద్దిపేట చుట్టుపక్కల 60, 70 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి తమ సమస్యలకు పరిష్కారం తెలుసుకున్నారని, ఉచిత గుండె వైద్య శిబిరం నకు విశేష స్పందన లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూన్నమని, భవిష్యత్ లో పిల్లలకు సంబంధించిన,  ఉపయోగకరమైన ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది  పాల్గొన్నారు.