గురుకులంలో స్కూల్ కౌన్సిల్ బాడీ ఎలక్షన్స్..

నవతెలంగాణ- పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల పాఠశాలల్లో స్కూల్ కౌన్సిల్ బాడీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికల విధంగా నిర్వహించారు. ఈ ఎన్నికలు సాధారణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా నిర్వహించడం జరిగింది. ఓటింగ్ విధానాన్ని ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేసి ఎలక్షన్లను నిర్వహించినట్టు వీటి ఫలితాలు రేపు వెలువరించడం జరుగుతుందని గురుకుల ప్రిన్సిపాల్ నళిని తెలిపారు. ఈ సందర్భంగా నళిని మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠశాల దశ నుండే ఎలక్షన్ విధానంపై అవగాహన కల్పించడం కోసమే ఈ ఎలక్షన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఈ ఎలక్షన్ ద్వారా విద్యార్థులకు ఎలక్షన్ పట్ల అవగాహన ఉంటుందని తమ ఓటును రాబోయే రోజుల్లో దుర్వినియోగం చేయకుండా వాడుకోవచ్చని విధానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు సర్పంచ్ తిరుమల్ రెడ్డి,ఎస్సై కోనారెడ్డి,ఎన్నికల విధానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుమలరెడ్డి, ఎస్సై కోనారెడ్డి, ఉపసర్పంచ్ కొండ విట్టల్, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.