బోనాల జాతరలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
సూరంలోని కట్టమైసమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌, మాజీ ఎంపీపీ, టీపీసీసీి ప్రతినిధ కోలన్‌ హాన్మంత్‌ రెడ్డి, బీజేపీ మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్‌ రెడ్డి, బీజేపీ మేడ్చల్‌ అర్బన్‌ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ శంభీపూర్‌ కష్ణ ముఖ్య అతిథులుగా వేరువేరు సమయంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం సంతోషంగా ఉందని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ప్రెసిడెంట్లు, డివిజన్‌ ప్రెసిడెంట్లు, ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్‌ నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.