హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌

Shiva Raj Kumarశివరాజ్‌ కుమార్‌ నటిస్తున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఘోస్ట్‌’.
ఈ పాన్‌ ఇండియా సినిమాకి దర్శకుడు శ్రీని దర్శకుడు. రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్‌ నాగరాజ్‌ తన సందేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివరాజ్‌ కుమార్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని మేకర్స్‌ ఈ చిత్రం నుండి బిగ్‌ డాడీ టీజర్‌ని బుధవారం రిలీజ్‌ చేశారు.
‘ఈ టీజర్‌నిలో షాట్స్‌, ‘మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంత కంటే ఎక్కువ మందిని నేను నా కళ్ళతో భయపెట్టాను. దే కాల్‌ మీ ఓ జీ… ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టర్‌” అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌, శివన్న (శివరాజ్‌కుమార్‌) టెర్రిఫిక్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో సూపర్‌ స్వాగ్‌తో ఆకటు ్టకున్నారు. అర్జున్‌ జన్య అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, యాక్షన్‌ ఫిల్మ్‌కి తగ్గ లైటింగ్‌ మూడ్‌ను అందించిన సినిమాటోగ్రాఫర్‌ మహేష్‌ సింహా పనితనం ఆకట్టుకుంటుంది. ‘బిగ్‌ డాడీ’గా ఏకంగా వార్‌ టాంకర్‌నే తెచ్చిన దర్శకుడు శ్రీని విజన్‌ను మెచ్చుకోకుండా ఉండలేం. నిర్మాత సందేశ్‌ నాగరాజ్‌ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని టెక్నికల్‌గా టాప్‌ లెవెల్‌లో నిర్మిస్తున్నారు అని చిత్ర బృందం పేర్కొంది. అనుపమ్‌ ఖేర్‌, జయరామ్‌, ప్రశాంత్‌ నారాయణ్‌, అర్చన జాయిస్‌, సత్య ప్రకాష్‌, దత్తన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో దసరా కానుకగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.