
గత ఎనిమిది రోజులుగా మండలం కేంద్రంలో వివిధ గ్రామ పంచాయతీల సిబ్బంది మరియు కార్మికులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మెకు గురువారం ప్రజా సేవకులు భూక్య దేవ్ సింగ్ సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న సిబ్బంది అందరికీ సంఘీభావం తెలిపి సమావేశంలో దేవ్ సింగ్ మాట్లాడుతూ గ్రామ సిబ్బంది చేస్తున్న పోరాటం న్యాయపరమైనదని వారందరినీ ప్రభుత్వం వెంటనే గుర్తించి వారి ఉద్యోగాలకు భరోసా కల్పిస్తూ వారి ప్రధాన డిమాండ్ గ్రామపంచాయతీలలో పని చేసే సిబ్బంది ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని అన్నారు. అదేవిధంగా వారికి ప్రభుత్వం నుండి ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అనునిత్యం గ్రామపంచాయతీలను పట్టణాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఇదే ఉద్యోగాన్ని జీవనాధారంగా బతుకుతున్న గ్రామపంచాయతీ సిబ్బంది మరియు మున్సిపాలిటీ ఉద్యోగస్తుల జీవితాలు బాగుపడేలా వారి ఉద్యోగ జీవితాలకు భరోసా కల్పించేలా వెంటనే ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. పట్టుదలతో కార్యక్రమం నిర్వహించి అనుకున్నది సాధించేంత వరకు పోరాడాలని గ్రామ సిబ్బందికి పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమానికి సామాజికవేత్త దొంతి విజేందర్ రెడ్డి హాజరై వారికి సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపగా ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ మరియు మున్సిపాలిటీ సిబ్బంది సభ్యులు దాదాపు 200 మంది పాల్గొన్నారు.