జిపి కార్మికులకు కత్తి కార్తీక మద్దతు..

– జీపీ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటాం 
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 

జిపి కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి తాము అండగా ఉంటామని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ డిమాండ్ చేశారు.దుబ్బాక మండలంలో 8వ రోజు కొనసాగుతున్న సమయంలో ఆమె కార్మికులకు గురువారం మద్దతు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..  30 ఏళ్లుగా గ్రామపంచాయతీలో కార్మికులు పనిచేస్తున్నారని, నేడు వారు న్యాయబద్ధంగా చేస్తున్న సమ్మె చేస్తుంటే అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ కార్మికుల ఉద్యోగులను వెంటనే  పర్మినెంట్ చేయాలని, జీవో నెంబర్ 60 ప్రకారం కార్మికులందరికీ రూ. 19,600 వేతనం చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు తమ మద్దతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఐరేని సాయితేజ గౌడ్,టిపిసిసి మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నల్ శ్రీనివాసరావు, మిద్దె భూపాల్ గౌడ్ (సిద్దిపేట జిల్లా సేవాదళ్ కార్యదర్శి), అశోక్ గౌడ్, ఎల్లం, కుమ్మరి రవీందర్, మగ్బుల్, కాశిబోయిన శ్రీనివాస్, చాకలి నాగరాజు, అరుణ్ కుమార్, శ్రీనివాస్, నవీన్ గౌడ్, అంజా గౌడ్, ఐరేని సాయితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.