జిల్లా సాహిత్య అభిమానుల తెలంగాణవాదుల చిరకాల ఆకాంక్ష..

– సాకారం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు
– తెలిపిన జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి
నవతెలంగాణ- కంటేశ్వర్
జిల్లా సాహిత్య అభిమానుల తెలంగాణ వాదుల చిరకాల ఆకాంక్ష సహకారం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనచారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని భారత జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జులై 22న ఖిల్లా జైలులో తెలంగాణ ప్రజా కవి దాశరధి కాస్య విగ్రహం ఆవిష్కరణ. జైలు గది పునరుద్ధరణ.1000 మంది కళాకారులతో నగరంలో భారీ ర్యాలీ. 200 మంది సాహిత్య అభిమానులతో సాహితీ సమ్మేళనం.తెలంగాణ వాదుల కోరిక మేరకు తన ఎమ్మెల్సీ నిధులనుండి 40 లక్షలు కేటాయించి పనులు పూర్తి చేయించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని తెలిపారు.నెలరోజుల వ్యవధిలోనే అన్ని పనులు పూర్తి. జైలు గదిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మైనపు విగ్రహాలు. దాశరధి జయంతి అయిన జూలై 22 నాడు కార్యక్రమాలు. ఉదయం నగరంలో కళాకారుల భారీ ర్యాలీ. అనంతరం పునరుద్ధరించ బడిన ఖిల్లా జైలు గది ప్రారంభం. కాస్య విగ్రహం ఆవిష్కరణ.పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార అనధికార ప్రముఖులు, పాల్గొన్న దాశరధి, వట్టికోట కుటుంబీకులు. పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున తరలిరానున్న సాహితీవేత్తలు అని తెలియజేశారు. కవి సమ్మేళనాలు, దాశరధి సినీ గీతాల విభావరి. కళాకారుల ఎంపికలో జిల్లా కళాకారులకు ప్రాధాన్యం ఉండాలని  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కార్యక్రమాల ఏర్పాటు కోసం నిన్న జైలును సందర్శించిన సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక ఎమ్మెల్యే గణేష్ బిగాల. ఈ సమావేశం లో భారత జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, నరాల సుధాకర్, జాగృతి సాహిత్య విభాగం కన్వీనర్ శ్రీనివాస్ ఆర్య, పులి జైపాల్ తదితరులు పాల్గొన్నారు.