పోడు భూమి హక్కు పట్టాలు పంపిణీ చేసిన సర్పంచ్ ఊకే మోహన్ రావు

నవతెలంగాణ -తాడ్వాయి 
మండలంలోని బంధాల గ్రామపంచాయతీ పరిధిలోని బంధాల 165, బొల్లెపల్లి138, నర్సాపూర్ (పిఎల్) అల్లిగూడెం, పోచపూర్ 65 గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉప సర్పంచ్ యాప మోహన్ రావు ల ఆధ్వర్యంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసి గిరిజన రైతులకు భూమి హక్కు కల్పిస్తూ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఓకే మోహన్ రావు మాట్లాడుతూ భూములపై హక్కుల కోసం గిరిజనులు చేస్తున్న పోరాటం సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆదివాసి బిడ్డలకు ప్రభుత్వం అందించిందని అన్నారు. దశాబ్దాలుగా తెలంగాణలో పోడు భూముల హక్కుల పోరు సమస్య, కెసిఆర్ తో సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ రావు, కార్యదర్శి అజ్మీర రమేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు,గ్రామ పెద్దలు పాల్గొన్నవారు.