మాయమాటలతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌..

– మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి
నవతెలంగాణ-కోహెడ
నీళ్ళు, నిధులు, నియామకాలంటూ మాయ మాటలు చెప్పి బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చెంచల్‌చెర్వుపల్లి గ్రామంలో పల్లె పల్లెకు ప్రవీణ్‌ అన్న.. గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీలోకి చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ, డబుల్‌బెడ్‌ రూమ్‌లలో ఏ ఒక్క హామి నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో తాను ఎమ్మేల్యేగా ఉన్నపుడు ఐదు సంవత్సరాలలో 10 వేల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, ప్రస్తుత ఎమ్మెల్యే ఒక్క డబుల్‌ బెడ్‌ రూం కూడా ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగేనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తామన్నారు. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న తరహా లో మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఏక కాలంలో రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని, రూ. 5 వందలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు బస్వరాజ్‌ శంకర్‌, మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు సంపత్‌రావు, ఎంపీటీసీ బోయిని నిర్మల జయరాజు, మాజీ సర్పంచ్‌లు శెట్టి సుధాకర్‌, భీంరెడ్డి మల్లారెడ్డి, కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు భీంరెడ్డి తిరుపతిరెడ్డి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చింతకింది శంకర్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు దూలం శ్రీనివాస్‌గౌడ్‌, సోషల్‌ మీడియా మండల కో ఆర్డినేటర్‌ మహమ్మద్‌ రఫీ, హుస్నాబాద్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు శ్రీకాంత్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు బండిపల్లి నారాయణగౌడ్‌, బందేల బాలకిషన్‌, వేల్పుల వెంకటస్వామి, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌, రాంచంద్రం, శ్రీనివాస్‌, చంద్రారెడ్డి, అశోక్‌రావు, కిషన్‌, జనార్ధన్‌, తూటి రాజిరెడ్డి, సంపత్‌, రవీందర్‌, రాచూరి శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, పిడిశెట్టి సాయి, చందూ, సంపత్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గూడ స్వామి, నర్సింహారెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గోన్నారు.