నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిన్నటికి నిన్న 31 మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా 22 మంది మున్సిపల్ కమిషనర్లను కూడా బదిలీ చేసింది. వీరంతా సెలక్షన్ గ్రేడ్‌కు చెందిన మున్సిపల్ కమిషనర్లే కావడం గమనార్హం. మరికొందరికి ఆ గ్రేడ్‌కు పదోన్నతి ఇచ్చి, కమిషనర్లుగా పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సీ సుదర్శన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎమ్ఏ)లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బీ గీతా రాధికను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి బదిలీ చేశారు. ఖాళీ అయిన ఆమె స్థానంలోకి బడంగ్‌పేట మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న టీ కృష్ణమోహన్‌రెడ్డిని నియమించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేస్తున్న బీ సుమన్‌రావును బడంగ్‌పేటకు బదిలీ చేశారు. మీర్‌పేట మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీహెచ్ నాగేశ్వర్‌ను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పంపారు. నాగారం మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఏ వాణికి స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్‌గా పదోన్నతి కల్పించి మీర్‌పేటకు బదిలీ చేశారు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సీహెచ్ శ్రీకాంత్‌కు కూడా పదోన్నతి ఇచ్చి తుర్కయాంజాల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న కే నారాయణరావును జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఏ స్వామికి పదోన్నతిపై పాల్వంచకు బదిలీ చేశారు. మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ పీ రవీంద్ర సాగర్‌కు పదోన్నతిపై ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న జీ రాజేంద్రకుమార్‌ను నాగారం మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ మున్పిపల్ కమిషనర్ హౌదాలో పోచారం మున్సిపాల్టీలో పనిచేస్తున్న ఏ సురేష్‌ను అదే హౌదాలో జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. తుర్కయాంజాల్‌లో పనిచేస్తున్న ఎమ్డీ సాబేర్ అలీని ఘట్కేసర్కు బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎమ్ పూర్ణచందర్‌ను మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. నందికొండ మున్సిపాల్టీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్ రవీందర్‌రెడ్డిని పెద్ద అంబర్‌పేటకు బదిలీ చేశారు. పెద్ద అంబర్‌పేటలో గ్రేడ్-2 కమిషనర్‌గా పనిచేస్తున్న బీ సత్యనారాయణ రెడ్డిని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. కొత్తపల్లి కమిషనర్‌గా పనిచేస్తున్న కే వేణుమాధవ్‌ను నందికొండకు మార్చారు. ఘట్కేసర్ కమిషనర్‌గా పనిచేస్తున్న పీ వేమన్‌రెడ్డిని పోచారంకు బదిలీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆర్ త్య్రయంబకేశ్వరరావును రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. హుస్నాబాద్‌లో పనిచేస్తున్న ఎస్ రాజమల్లయ్యను దమ్మాయిగూడకు బదిలీ చేశారు. ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్న మహ్మద్ యూసుఫ్‌ను పదోన్నతిపై జీహెచ్ఎంసీకి బదిలీ చేశారు. సుల్తానాబాద్‌లో పనిచేస్తున్న ఎమ్ఆర్ రాజశేఖర్‌ను హుస్నాబాద్ కమిషనర్‌గా నియమించారు. లక్సెట్టిపేట మున్సిపాల్టీలో గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఏ వెంకటేష్‌ను కొత్తపల్లి మున్సిపాల్టీకి బదిలీ చేశారు.