ఎఐసిసి కార్యదర్శి విశ్వనాథ్ ని కలిసిన జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు

నవతెలంగాణ- కంటేశ్వర్
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ తో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హాందం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు,పిసిసి ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, రూరల్ ఇంఛార్జి భూపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అరికెల నర్సారెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, మాజీ వాక్ఫ్ బోర్డ్ చైర్మన్ జావిద్ అక్రమ్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పా గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరాడి భాగ్య, సేవాదల్ అధ్యక్షులు సంతోష్, మైనారిటీ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, ఎస్సీ అధ్యక్షులు లింగం, బీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్ సమావేశమై ప్రస్తుతం జిల్లాలో ఉన్న పరిస్థితులపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.