‘తెలంగాణ వచ్చినా స్రమస్యలు తీరడం లేదు’

నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
తెలంగాణ వచ్చి ఇన్ని ఏండ్లు అవుతున్నా ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని శేరిలింగంపల్లి బీజేపీ పార్టీ కాంటెస్ట్‌ డ్‌ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్‌ అన్నారు. ప్రజా సమస్యలపై ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారానికి 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా హైదర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని అల్లాపూర్‌, జయభారత్‌ నగర్‌ , సెవెన్‌ హిల్స్‌ ప్రాంతాలలో ఆయన పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ గా ఉన్న ఏ స్థలాన్ని బీ.అర్‌.ఎస్‌ నాయకులు వదలడం లేదని, బీ.అర్‌.ఎస్‌ ప్రభుత్వం కబ్జాలకు మారు పేరుగా తయారైందన్నారు. ప్రశ్నించిన వారిని తమ గుండయిజం, రౌడీయిజం తో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజలు వాపోయారని ఆరోపించారు. కిందికుంట చెరువును అధికార పార్టీ నాయకులు కబ్జా చేయడంతో వర్షపు నీరు చెరువులో కాకుండా రోడ్ల మీదకు చేరి ఇండ్లలోకి చేరుతున్నదన్నారు. వర్షపాతం అధికంగా నమోదు ఐనప్పుడు చెరువులో నిలువ ఉండవలసిన నీరు, దిగువ లో ఉన్న గహాలలోకి నీరు చేరడంతో మొత్తం మునిగిపోయాయన్నారు. కబ్జా పై గతంలో న్యాయసా ్థనాన్ని అశ్రయించామని, త్వరలో విముక్తి కలిపిస్తామని హామీ ఇచ్చారు. కరెంట్‌ తీగలు ఇండ్ల పైనుండి చాలా ప్రమాదకరంగా కిందకి వేళ్ళాడుతు న్నాయని, రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. వెలగా శ్రీనివాస్‌, నరేందర్‌ రెడ్డి, వీరయ్య చారి, విజిత్‌ వర్మ, నవీన్‌ గౌడ్‌, శివకుమార్‌ వర్మ, శ్రీనివాస్‌, రత్నకుమార్‌, చిన్నం సత్యం, కష్ణంరాజు, లక్ష్మీనారాయణ, రవికిరణ్‌, భ్రమ్మయ్య , కోటేశ్వర రవికిరణ్‌, పి.శ్రీనివాస్‌, దయాకర్‌, చాణక్య, సిద్ధు, రత్నకుమార్‌, నాగరాజు, అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.