నవతెలంగాణ – అశ్వారావుపేట
పట్టణం నుండి పల్లె వరకు వైద్య సేవలు విస్తరిస్తున్నాం. ప్రతీ చిన్న రోగానికి పట్టణాలకు వెళ్ళి, ప్రయివేట్ వైద్యులను ధనవంతులు ను చేయకండి. గ్రామాల్లో సైతం ఆర్ఎంపిపిఎంపిల వద్దకు వెళ్ళి వైద్యం చేయించు కోవద్దు అంటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి నుండి పల్లెల్లో మండల వైద్యాధికారులు వరకు ఒకటే ఉపన్యాసాలు దంచేస్తున్నారు. కానీ వీరు చెప్పే విధంగా పల్లెల్ల సామాన్యులకు వైద్యం అందు తుందా అంటే ప్రశ్నార్ధకమే. వైద్యుడు ఉంటే మందులు ఉండవు. వైద్యుడు మందులు ఉంటే సిబ్బంది సరిపడా ఉండరు. వీరందరూ, అన్ని ఉన్నా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు ఉండవు.ఇదంతా మనందరికి తెలిసిన విషయమే అయినా పాలకులు చెప్పిన విషయాలను అధికారులు అమలు చేయాలి కాబట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 240 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నవి. వీటిలో 153 ఉప కేంద్రాలను పల్లె దవాఖానా లుగా మార్చారు. ఇందులో వైద్యం చేయడానికి బి.ఎస్సీ నర్సింగ్ లో నైపుణ్యం ఉన్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎం.ఎల్.హెచ్.పి ) ఒక్కొక్కరిని నియమించారు. కానీ చాలా మంది స్లైడింగ్ విధానంలో తిరిగి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు.దీంతో చాలా దవాఖానా ల్లో తలనొప్పికి గోళీ ఇచ్చే వారు లేక గ్రామీణులు తలలు పట్టుకుంటున్నారు. అశ్వారావుపేట మండలం లో మొత్తం 12 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా 10 ఉప కేంద్రాలను పల్లె దవాఖానా లుగా మార్చారు.ప్రారంభంలో 10 మంది ఎం.ఎల్.హెచ్.పి లు చేరారు.నెల రోజులు కూడా గడవకముందే స్లైడింగ్ విధానంలో బదిలీ అయ్యారు.ప్రస్తుతం 5 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు.మరో అయిదుగురు ఎపుడు వస్తారో తెలియదు. అశ్వారావుపేట 1, 3, రూరల్, నారంవారిగూడెం, రెడ్డిగూడెం ఉప కేంద్రాల్లో సిబ్బంది ఉన్నారు. అశ్వారావుపేట 2, వేదాంత పురం, తిరుమలకుంట, నందిపాడు, పేరాయిగూడెం ఉప కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తుంది. వినాయక పురం, మామిళ్ళ వారిగూడెం కేంద్రాలు పల్లె దవాఖానాలుగా ఇంకా అప్ గ్రేడ్ అవలేదు. అయినా పల్లె దవాఖానాలు రంగులు, హంగులు కల్పించారు. శిక్షణా లో కొందరు, స్లైడింగ్ లో కొందరు వెళ్ళారు. ప్రోగ్రాం ఆఫీసర్ మణికంఠ రెడ్డి. ఈ విషయం అయి ప్రోగ్రాం ఆఫీసర్ మణికంఠ రెడ్డిని వివరణ కోరగా కొందరు శిక్షణలో ఉన్నారని, మరికొందరు స్లైడింగ్ వేరే ప్రాంతాలకు వెళ్ళారని తెలిపారు.