వృద్దులు ఆశ్రమంలో వైద్యం శిభిరం..

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని అమ్మ సేవా సదనంలో సోమవారం అశ్వారావుపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆరోగ్య శిభిరం నిర్వహించారు. ఇందులో గల 26 మంది వృద్దులకు షుగర్, రక్తపోటు(బిపి)పరీక్షలు నిర్వహించారు. సంభందిత బాధలకు మందులు పంపిణీ చేసారు. సాధారణ సమస్యలు కల వారికి తగిన మందులు అందజేసారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఆరోగ్య సహాయకులు గోపాల్, అరుణ ఆశా కార్యకర్త బేబీ పాల్గొన్నారు.