రైతు తీర్మానంలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి 

నవతెలంగాణ -బెజ్జంకి
వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 విద్యుత్ సరఫరాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక యందు చేపట్టిన రైతు తీర్మానంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని తీర్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నిన రాబోయే ఎన్నికల్లో రైతుల ఆశీర్వాదంతో మూడవసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఎమ్మెల్యే దీమా వ్యక్తం చేశారు. ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కనగండ్ల కవిత, జిల్లా, మండల ఆర్ఎస్ఎస్ సభ్యులు, బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, అయా గ్రామాల రైతులు హజరయ్యారు.