
– రూ.37 కోట్లు వ్యయంతో బాయిలర్ నిర్మాణం పనులకు శంకుస్థాపన..
– ఎమ్మెల్యే మెచ్చా ను ఆహ్వానించిన ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామ కృష్ణా రెడ్డి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికే అశ్వారావుపేట ఆదర్శం. ఈ నేపద్యంలో రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అశ్వారావుపేటలో మరో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రూ.150 కోట్లు మంజూరు చేయించారు. ఈ క్రమంలో బుధవారం అశ్వారావుపేటలో రూ.37 కోట్ల వ్యయంతో బాయిలర్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామ కృష్ణ మంగళవారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట మండలం, తాటి సుబ్బన్న గూడెంలోని వారి నివాసంలో మంగళవారం కలిసి గొర్రె గుట్ట దేవాలయం ప్రసాదాన్ని అందజేసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగు మరియు తదితర విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట పరిశ్రమల మేనేజర్ బాలకృష్ణ, కళ్యాణ్ గౌడ్, నాగబాబు, రైతు చీమకుర్తి వెంకటేశ్వరరావు ఉన్నారు.