పంచాయతీ కార్మికుల సమ్మె పై సర్కారు సైలెంట్..!

– అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూడడం అవివేకం
– వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుల క్యాంప్ కార్యాలయం వద్ద పోరాటాన్ని కొనసాగించిన గ్రామపంచాయతీ సిబ్బంది
నవతెలంగాణ- కంటేశ్వర్
పంచాయతీ కార్మికుల సమ్మెపై సర్కారు సైలెంట్ గా ఉండడం అక్రమాలతో ఉద్యమాన్ని అణచివేయాలని చూడడం అవివేకమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుల క్యాంప్ కార్యాలయం వద్ద పోరాటాన్ని కొనసాగించిన గ్రామపంచాయతీ సిబ్బంది. ఈ సమ్మెకు మద్దతు తెలియజేసిన సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శి సుధాకర్, ఐఎఫ్ టియు జిల్లా నాయకులు జేపీ గంగాధర్ లు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికై జూలై 6 నుండి జరుగుతున్న సమ్మెకు నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తమరి ద్వారా లేఖ రాయాలని తెలంగాణ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయితీ వేలమంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్స్ తదితర కేటగిరిలలో నర్సరీలు, వైకుంఠదామం, పార్కులు, ఆఫీస్ నిర్వహణలో విధులు నిర్వహిస్తున్నారు. గత 20-30 సంవత్సరాలుగా పనులు చేస్తున్నప్పటికీ పంచాయతీ సిబ్బంది పర్మినెంట్, పనికి గుర్తింపు, పని భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్ఇఎస్ఐ, ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. గ్రామ పంచాయతీ సిబ్బంది నందరిని పర్మినెంట్ చేయాలని, పి.ఆర్.సిలో నిర్ణయించిన బేసిక్ ప్రకారం పంచాయతీ సిబ్బందికి రూ.19,000/-లు చెల్లించాలని, ఆ లోపు జీవో. నెం. 60లో పేర్కొన్న వేతనాలను కేటగిరీల వారీగా పంచాయితీ సిబ్బందికి నెలకు రూ. 15,600/-లు కారోబార్, బిల్ కలెక్టర్లకు, ఇతర స్కిల్ సిబ్బందికి రూ. 19,500/-లు చెల్లించాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు, అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమేషన్ ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే వివిధ కేటగిరీలను యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది.
          రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయినప్పటికీ పంచాయతీ సిబ్బంది సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కార్మికులలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. 2011 జనాభా ప్రాతిపాధికన 500 మందికి ఒక కార్మికుడిని నియమించి పనులు చేయిస్తున్నారు. ప్రతి సం॥రం జనాభా పెరుగుతున్నది. గ్రామాల విస్తరణ పెరిగింది. దీంతో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్మికులను నియమించారు. జీవో నెం. 51 విడుదలకు ముందు పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందినందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. అదనంగా నియించిన కార్మికులను పంచాయతీ కార్మికులుగా గుర్తించి అందరికి సమానంగా వేతనాలు ఇవ్వాలి. వేతనాలకు ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించాలి. కొత్తగా నియమించే వారికి సంబంధించి గ్రామ పంచాయతీ తీర్మాణం చేయాలి. డి.పి.ఓ ఆమోదం తర్వాతనే ఈ నియామకాలను అమలు చేయాలి. అక్రమ నియామకాలను అరికట్టాలి.రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 51 తీసుకొచ్చి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. గ్రామ పంచాయతీలలోని వివిధ రకాల కేటగిరీలన్నింటినీ రద్దుచేసి కలం పట్టిన కారోబార్, బిల్ కలెక్టర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మల్టీపర్పస్ వర్కర్ విధానం: పేరుతో ఏ పనైనా చేయాలని బలవంతంగా బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకొని కార్మికులను వేధింపులకు గురి చేస్తూ పనిలో నుండి తొలగిస్తున్నారు. సిబ్బందితో నైపుణ్యం లేని పనులు చేయించడంతో అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు -కోల్పోతున్నారు. ఈ కాలంలో గ్రామ పంచాయతీలకు కొత్తగా ట్రాక్టర్లు కేటాయించిన తర్వాత ట్రాక్టర్లు నడిపేందుకు నైపుణ్యం కల్గిన డ్రైవర్లు లేకపోవడం, పంచాయితీ కార్మికులతోనే డ్రైవింగ్ చేయించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. దీనిని ఫలితంగా కార్మిక కుటుంబాలు రొడ్డున పడుతున్నాయి. ప్రతి ఉద్యోగి, కార్మికుడికి సం॥రానికి రూ.399 కేంద్ర ప్రభుత్వ తపాల బీమా ప్రీమియంతో ప్రమాదంలో మరణించిన, అంగవైకల్యం పాలైనా, గాయాల పాలైనా, సహజ మరణం పొందిన కార్మికులకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించి రూ.10లక్షల ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలి. కావున పై సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల డిమాండ్లను, ఇతర సమస్యలను పరిష్కరించేలా తమరు మా తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి కి సమస్యల పరిష్కారానికి లేఖ రాసి, మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని, తమ ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కటారి రాములు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు శివ, భూమన్న ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు వెంకన్న మురళి పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేష్ గంగారాం కరోబార్ యూనియన్ జిల్లా నాయకులు నందు, సావిత్రి, ప్రదీప్, ధర్మన్న సాయిలు, లక్ష్మీ సుజాత సాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.