
హుస్నాబాద్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలలో మంగళవారం రెవిన్యూ అధికారులు ఈవీఎంతో ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే తీరును అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ అర్ఐ సుహాసిని, జూనియర్ అసిస్టెంట్ కరీం తదితరులు పాల్గొన్నారు.