‘ఎస్కీ’లో పీజీడీఎం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నవతెలంగాణ-సిటీబ్యూరో
మూడు పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని ‘ఎస్కీ’ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.రామేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఇఎస్‌సీఐ)లోని స్కూల్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, జనరల్‌ మేనేజ్‌మెంట్‌, ఇండిస్టీయల్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ ‘ఇఆర్‌సీఐ. ఇడీయూ.ఇన్‌’ లేదా ‘ఇఆర్‌సీఐహెచ్‌వైడీ. ఓఆర్‌జీ’ ద్వారా లేదా 98496 97342, 9490116179 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.