భారీ వర్షానికి నివాస గృహం నేలమట్టం..

నవతెలంగాణ-డిచ్ పల్లి

ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా కూర్చున్న భారీ వర్షానికి ఒక నివాస గృహం నేలమట్టం అయినట్లు సర్పంచ్ లోలం సత్యనారాయణ, ఉపసర్పంచ్ రఘునాథన్ రాము తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఒక నివాసపు గృహం నేలమట్టమైనట్లు సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకొని లోపల ఉన్న పత్తిపాటి వస్తువులను బయటికి తీసి జెసిబి సహకారంతో పూర్తిగా తొలగించడం జరిగిందని సర్పంచ్ లోలం సత్యనారాయణ వివరించారు ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్లి బాధితుడికి గృహ లక్ష్మి పథకంలో ఇల్లు నిర్మించే విధంగా తమ వంతు కృషి చేస్తామని వారన్నారు.