బ్యాంకాక్‌లో జరిగిన కెడిఎం ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్స్‌లో హైదరాబాద్ క్రీడాకారులు సత్తా చాటారు. గ్రాండ్‌మాస్టర్ విజరు సోమ సారథ్యంలో పోటీపడిన జట్టు ఏకంగా 36 పతకాలు సాధించింది. ఇందులో ఏడు పసిడి, పది రజతం, 19 కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రిశా పాగె, స్వాతి, మైత్రి రామనాథం, అశ్విక, ఆవిశ్ చౌదరి, మాహిర్ యశ్వంత్, సుబ్బారావు, వినోద్ చౌదరి, ఆదితి విజరు మల్టీపుల్ మెడల్స్ సాధించారు.