మోటార్ బైక్ అదుపుతప్పి ఒకరి మృతి

నవతెలంగాణ -నవీపేట్: మండలంలోని కోస్లి గ్రామానికి చెందిన అడెల్లి సాయిలు (40) మోటార్ బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో మృతి చెందాడు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయిలు నవీపేట్ నుండి ఇంటికి వెళ్తుండగా నాగేపూర్ వద్ద డివైడర్ ను ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.