త్వరలో కామన్‌ మొబిలిటీ కార్డు

– ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
– తొలుత హైదరాబాద్‌ నగరంలోనే
– ఆర్టీసీ బస్సులు, మెట్రోరైల్‌, ఎంఎంటీఎస్‌, క్యాబ్స్‌, ఆటోలను వాడుకునే సౌకర్యం
– ఆగస్టు రెండోవారంలోగా ప్రారంభించేందుకు కార్యాచరణ
– అధికారుల సమావేశంలో మంత్రుల ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్‌ మెబిలిటీ కార్డుని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రోరైల్‌, ఆర్టీసీ సంస్ధలు కార్యాచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రోరైల్‌, ఆర్టీసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండేలా ఈ కార్డును తయారు చేయనున్నారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజరుకుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆర్టీసీ, మెట్రోరైల్‌ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్డుకు సంబంధించిన పలు వివరాలను అందించారు. కార్డు జారీ ప్రక్రియ నుంచి మొదలుకుని వివిధ ప్రాంతాల్లో దాని ఉపయోగం వరకు నగర ప్రజలకు అందుబాటులో ఉండే సేవల వివరాలను వారు వివరించారు. మొదట మెట్రోరైల్‌, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డుని జారీ చేస్తామని, ఇదే కార్డుతో సమీప భవిష్యత్తులో ఎంఎంటీఎస్‌, క్యాబ్‌సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునేలా విస్తరిస్తామని మంత్రులు తెలిపారు. ఇదే కార్డుతో భవిష్యత్తులో పౌరులు తమ ఇతర కార్డుల మాదిరే కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్‌ కార్డ్‌ ఫర్‌ అల్‌నీడ్స్‌ మాదిరి ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ నగరం వరకు ఈ కార్డును జారీ చేస్తామనీ, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డు సేవలు అందించేలా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను మంత్రులు అదేశించారు. ఈ కార్డు కలిగిన పౌరులు దేశవ్యాప్తంగా నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. దీంతో ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ కార్డుతో ఇతర మెట్రో నగరాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఆర్టీసీ బస్సులు, మెట్రోరైల్‌ ఇతర ప్రజా రవాణా వ్యవస్థను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు అవకాశముందన్నారు. ఈ కార్డును ప్రయోగాత్మకంగా ఆగస్టు రెండో వారంలోగా నగర పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని మంత్రులు ఆదేశించారు. ఇందుకు సంబంధించి మెట్రోరైల్‌, ఆర్టీసీ సంస్థ అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు పోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న ఈ కామన్‌ మొబిలిటీ కార్డుకి ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ పౌరుల నుంచి పేర్లను సూచించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:55):

blood aYB sugar chart in india | xjG blood sugar 132 a1c | is blood sugar uOk 89 good for early morning | high blood sugar levels TPH at end of pregnancy | what is the normal range mnW of blood sugar before food | ONM white rice spike blood sugar | can stress drop CJf your blood sugar | can hand lotion affect blood sugar reading eqR | blood sugar after Jwb eating keto | what helps lower FHz blood sugar naturally | blood sugar 500 symptoms A6H | is it illegal to drive with low blood yc8 sugar | signs and Xhg symptoms of diabetes low blood sugar | shower lowers neP blood sugar | low end of normal blood sugar hiO | symptoms of hypoglycemia blood sugar 76 QDb | my blood sugar Pe4 is 74 what does that mean | convert 160 blood adf sugar to a1c | blood sugar 15 Sme 150 after eating | guide blood sugar diet On3 | normal blood sugar reading 2 hours after eating qr1 | what foods spike your blood sugar SqO | will sweeteners raise Qf3 blood sugar | can an app measure blood sugar Iuq | cvs pharmacy check blood 9BP sugar | what bring down XIs high blood sugar | how long after eating candy does VKx blood sugar rise | blood bTv sugar 187 after meal | can a low carb obG diet cause high blood sugar | signs bJ0 and symptoms of a low blood sugar | prune juice 7Io and blood sugar | blood sugar sL8 symptoms in tamil | cLd measure blood sugar with apple watch | alcohol effect vrS on blood sugar levels | urinary ICy tract infection and blood sugar levels | postprandial blood sugar level 79 EFl | how to tell if efk your blood sugar is too high | virus affect blood sugar P4m | is 107 normal blood sugar L7l level | low blood sugar fights cancer 2XA | does Inp salad spike blood sugar | when psK should blood sugar be checked after eating | can naproxen raise your blood D61 sugar | can a piercing drop your bVJ blood sugar | v1h how long does a blood sugar monitor last | how cgh do you know you have high blood sugar | does gavilyte c AGn increase blood sugar | libra blood sugar monitor cost Mmk | does stevia raise yWY your blood sugar | PjL how to control blood sugar naturally during pregnancy