– జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య
నవతెలంగాణ- కంటేశ్వర్
మణిపూర్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి చేయాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేడు భాగ్య డిమాండ్ చేశారు. ఇద్దరూ కూకి తెగకు చెందిన మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటనకు పూర్తి బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ వహించి ఆయన పదవికి రాజీనామా చేయాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడీ భాగ్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో నిర్వహించిన నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య గారు ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబాటు వేణురాజ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.ముందుగా వారు జిల్లా కాంగ్రెస్ భవన్ నుండి రైల్వే స్టేషన్ వద్ద గల శివాజీ విగ్రహం వరకు నరేంద్ర మోడీకి మరియు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అనంతరం నీరడి భాగ్య గారు మాట్లాడుతూ మణిపూర్ హింసకు కారణం బిజెపి ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్ష్యమే కారణమని, మణిపూర్ రాష్ట్రం రెండు నెలలుగా తగలబడిపోతున్న పట్టించుకోలేదని హింస తగ్గించడానికి పరిష్కార మార్గాలు అన్వేషించడంలో విఫలమైందని ఆమె మండిపడ్డారు. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి వారిని దారుణంగా హత్య చేసిన ఉదంతం సభ్య సమాజం తలదించుకుంటుందని ఈ ఘటన మానవత్వానికి మాయని మచ్చ అని ఆమె అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడానికి కారణం బిజెపి పార్టీయేనని, రెండు నెలలుగా అల్లర్లు చేస్తున్న అల్లర్లను శాంతింప చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాకపోగా అల్లర్లకు ఆజ్యం పోసిందని ఆ అల్లర్లలో అమాయకపు ఆడవాళ్లు ఎందరో బలయ్యారని కుకీ మహిళల ఉదంతం వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రమే అని వెలుగులోకి రాని ఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయని ఎంతోమంది మహిళలు మణిపూర్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూకి తెగకు చెందిన మహిళలపై జరిగిన ఈ ఉన్మాద చర్య మరోసారి బిజెపి హయాంలో మహిళలకు రక్షణ లేదని రుజువు చేసిందని, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన ఘటన దేశం ఇంకా మర్చిపోలేదని, మణిపూర్ లో మహిళల పట్ల జరుగుతున్న అమానుష ఘటనలపై డబుల్ ఇంజన్ సర్కారు కు కనీసం చీమ కుట్టినట్లయినా లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య తెగల మధ్య అమాయకపు ప్రజల మధ్య చిచ్చుపెట్టే నీచ రాజకీయ సంస్కృతి బిజెపి సొంతమని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస అనేది ప్రవృత్తిగా మారిందని వారి స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఏ స్థాయికైనా దిగజారుతారని మరోసారి రుజువైందని, గతంలో 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ చేయించిన అల్లర్లలో దాదాపు 2000 మంది ఊచకోతకు గురయ్యారని ఎంతోమంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారని నిండు గర్భిణిగా ఉన్న మహిళను అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేసి జైల్లో ఉంచితే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వారిని విడిపించి సన్మానాలు చేసి ఊరేగించారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మణిపూర్ లో 2002 గుజరాత్ లో జరిగిన పరిణామాలే చోటు చేసుకుంటున్నాయని ఆమె పేర్కొన్నారు. బేటి బచావో బేటి పడావో అనే పెద్ద పెద్ద నినాదాలు ఇవ్వడం కాదని బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ లో ఆడపడుచుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని, మణిపూర్ లో గత 79 రోజులుగా హింస కొనసాగుతున్నప్పటికీ ఏమాత్రం స్పందించని అసమర్ధ ప్రధాని మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక దాడి చేసి హతమార్చిన ఘటనలో కేవలం నిందితులపై చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటన మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారని, దీన్నిబట్టి ప్రజల ప్రాణాల పట్ల మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ప్రధాని మోడీకి ఎలాంటి పశ్చాతాపం లేదని ఇలాంటి ప్రధాని దేశానికి అవసరం లేదని తక్షణమే ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ గాజుల సుజాత ,రాష్ట్ర కార్యదర్శి పద్మ ,మలైకా బేగం, జిల్లా ప్రధాన కార్యదర్శి సరోజ తో పాటు మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు ఎన్.ఎస్.యు.ఐ నాయకులు అష్రఫ్, సాయి తదితరులు పాల్గొన్నారు.