గ్రూప్‌-2కు 4.83 లక్షల దరఖాస్తులు

– సమర్పణకు నేడే ఆఖరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌-2 పోస్టులకు 4,83,640 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులను సమర్పించే అవకాశముందని తెలిపారు. ఇతర వివరాలకు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.