
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో అనంతరావు సూచించారు. శనివారం మండలంలోని అయ్యవారిపల్లి, సిద్ధ రామేశ్వర నగర్, భిక్కనూర్ పట్టణ కేంద్రాలలో పారిశుద్ధ పనులు పరిశీలించి, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని కార్యదర్శులకు సూచించారు. అలాగే శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి అందులో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రవీణ్ కుమార్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.