
నవతెలంగాణ-గోవిందరావుపేట.
మహిళలు వ్యవస్థ చేసి సామూహిక అత్యాచారం చేయడం ఒక అమానుషమైన చర్య అని దళిత ఐక్యత సమితి అధ్యక్షులు నెమలి బాలకృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలో దళిత ఐక్యత సమితి ముఖ్య కార్యవర్గ సమావేశం ప్రధాన కార్యదర్శి దూడపాక రాజేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాలకృష్ణ హాజరై మాట్లాడారు.మణిపూర్ లో మారణకాండ దుర్మర్గ మైన చర్య అనిదోషులను కఠినంగా శిక్షించాలన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి వెంటనే తొలగించాలి అని దళిత ఐక్యత సమితి డిమాండ్ చేశారు. గిరిజన మహిళలను వివస్త్రణ చేసి సామూహికంగా అత్యాచారం చేయడం సిగ్గు చేటు అని దోషులను కఠినంగా శిక్షి మణిపూర్ ముఖ్యమంత్రి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గౌరవ అధ్యక్షుడు దర్శనల సంజీవ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొనేటప్పుడు దిక్కుమాలిన రాజకీయాలు కుల మత రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ఓటు ద్వారా బుద్ది వచ్చేలా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ పురం ఉప సర్పంచ్ గందర్ల వెంకన్న,మొండి ఎద్దుల చంద్ర మోహన్,గుండె శ్యామ్,కురుసపెళ్లి విజయ్,మామిడి రమేష్,మంథాని రాజు,మామిడి కిరణ్,దర్శనల కోటి, దామర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.