సీఎం ఆర్ఎఫ్ చెక్కు పంపిణీ 

నవతెలంగాణ-రామగిరి 
రామగిరి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన శ్రీరాముల లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొంది మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సిఫారసుతో సీఎం ఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా 14 వేల వి లువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కాగా దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం రామగిరి మండలం కాంగ్రెస్ నాయకులు బాధితునికి అందజేశారు.ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తోట చంద్రయ్య,మంథని అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మడ్డి రాజకుమార్,తాటి సతీష్, సిద్ధం రామ్ నారాయణ,రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీధర్ వీణ తదితరులు పాల్గొన్నారు.