సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

– తాడ్వాయి పోలీసులు మండలంలో అవగాహన కార్యక్రమం

నవతెలంగాణ- తాడ్వాయి
స్మార్ట్ ఫోన్లు వాడకం విపరీతంగా పెరుగుతున్న నేటి సమాజంలో సైబర్ నేరగాండ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తాడ్వాయి పోలీసులు స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్ ఆదేశాల మేరకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబులు జాజ సాంబయ్య, గొంది రవీందర్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సైబర్ నేరాల గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. డబ్బులు ఫ్రీగా వస్తాయని చెప్పగానే ఆశపడి అట్టి సైబర్ నేరగాళ్లకు ఓటిపి చెప్పడం, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు  దూరంగా ఉండాలన్నారు. అనవసర లింకులు ఓపెన్ చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.