ముంబయి : సచిన్‌ను అధిగమించిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించారు. విండీస్‌తో తొలి టెస్టులో సెంచరీ మిస్ చేసుకున్న భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ … రెండో టెస్టులో అదరహౌ అనిపించారు..! సచిన్ తన సుదీర్ఘ కెరీర్‌లో 664 మ్యాచులు ఆడారు. ఇందులో వంద శతకాలు, 201 వికెట్లు ఉన్నాయి. అయితే విరాట్ తన 500వ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సఅష్టించారు. విరాట్ కంటే ముందు మరో తొమ్మిది మంది ఆటగాళ్లు మాత్రమే 500 మ్యాచ్‌ల క్లబ్‌లో ఉన్నారు. భారత ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. కానీ వారెవరూ తమ మైలురాయి మ్యాచ్‌లో సెంచరీ సాధించలేదు. ఆ ఘనత విరాట్ కే దక్కింది. సచిన్ 35 పరుగులు, ధోనీ 32లి (టీ20), రాహుల్ ద్రవిడ్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.