పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి దర్శకుడు సముద్రఖని మీడియాతో పలు ఆసక్తికర విశేషాలను షేర్ చేసుకున్నారు.
”వినోదయ సిత్తం’ కథని అన్ని భాషలకు చేరువ చేయాలని 12 భాషల్లో తీస్తున్నాం. తెలుగులో ఈ కథ ఎక్కువ మందికి రీచ్ కావడానికి కళ్యాణ్‌తో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ చెప్పగానే ఒక్కసారిగా మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో కొన్ని మార్పులతో చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. మాతకలోని ఆత్మని తీసుకుని పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశాం. మాతక కంటే గొప్పగా, విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. ఇప్పటిదాకా నేను చేసిన 15 సినిమాల్లో ఇదే నా బెస్ట్ మూవీ. ఈ సినిమా తర్వాత నాకు లభించి ప్రతీదీ బోనస్‌గా ఫీలవుతాను. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ నాకు ఒక తండ్రిలా అండగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. నేను తీసిన ఈ 15 సినిమాలలో మొదటిసారి తమన్ నేేపథ్య సంగీతం విని కంటతడి పెట్టుకున్నాను. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు’ అని చెప్పారు.