ఈవీఎంలపై అవగాహన పెంచుకోవాలి..

నవతెలంగాణ-వీణవంక
ప్రతీ ఒక్కరూ ఈవీఎంలపై అవగాహన పెంచుకోవాలని, అలాగే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏఈవో రాకేష్ సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచార రథం ద్వారా మండలంలోని కోర్కల్, నర్సింహులపల్లి, దేశాయిపల్లి గ్రామాల్లో మంగళవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సోమేశ్వర్, కానిస్టేబుల్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.