మోడీ దిష్టిబొమ్మను దగ్ధం..

నవతెలంగాణ – శంకరపట్నం
మణిపూర్ లో మహిళలను వ్యవస్థలను చేసి అత్యాచారం, హత్యలు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిన అశోక్ ఆరోపించారు. శంకరపట్నం మండల  కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని  నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను మంగళవారం దగ్ధం చేశారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్ మాట్లాడుతూ,మణిపూర్ లో మహిళలను వివస్రాలను చేసి అత్యాచారం, హత్యలు చేసిన కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్త రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ సంఘీ పరివార్ బిజెపి ఆగడాలను అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, కిన్నెరా మల్లక్క, ఏఐఎఫ్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి,బ్రాహ్మణ పల్లి యుగేందర్, కన్నం సదానందం, తడవేణి రవి, పిట్టల తిరుపతి, మేకల రవి, జూల లక్ష్మియ్య, దోమిటి వెంకట స్వామి, బొజ్జ ఐలయ్య, సారయ్య, కొమురయ్య, అంజలి, లక్ష్మి, కొంకట స్వరూప, ఐలవ్వ, కానుకం రాజవ్వ, శెంకర్, నారాయణ, మేకల లక్ష్మణ్, తదితరులు పాలుగోన్నారు.