బిఆర్ఎస్ నాయకుల కనుసైగల్లో డబల్ బెడ్ రూమ్ ల పంపిణీ

నవ తెలంగాణ-రామారెడ్డి
మండలంలోని అన్నారం గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ల బి ఆర్ ఎస్, నాయకుల, ప్రజా ప్రతినిధులు కనుసైదాల్లో వారికి సంబంధించిన వారికి మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేశారు. నిజమైన, అర్హులైన పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేయాలి. పంపిణీలో పారదర్శకత లేదని, గతవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, స్థానిక జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, స్థానిక తాసిల్దార్ ఆనంద్ కు  వినతి పత్రం ఇచ్చి, ఎంక్వయిరీ చేసి, నిజమైన లబ్ధిదారులకు అందించాలని తెలపడం జరిగింది. అయినా ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా, నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంగా, నిజమైన లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేయకపోతే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టి, నిజమైన పేద ప్రజలకు ఇల్లు అందే వరకు పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.