హైదరాబాద్‌కు విస్తరించిన ఫుడ్‌లింక్‌

– ఈ ఏడాది రూ.450 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం
హైదరాబాద్‌ : లగ్జరీ క్యాటరింగ్‌ సంస్థ ఫుడ్‌లింక్‌ హైదరాబాద్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. రూ.70-100 కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో కార్యకలాపాలను చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొంది.
అంబానీ-పిరమల్‌, దీపికా-రణ్‌వీర్‌ పెళ్లిళ్లకు తాము కేటరింగ్‌ చేశామని ఫుడ్‌లింక్‌ ఎఫ్‌అండ్‌బి హోల్డింగ్స్‌ ఇండియా సిఇఒ సంజరు వజిరాణి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల టర్నోవర్‌ అంచనా వేస్తున్నామన్నారు.
వచ్చే మూడు, నాలుగేళ్లలో రూ.800-1000 కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశంలోని కీలక నగరాలతో పాటు విదేశాల్లో టర్కీ, దుబారు (యుఎఇ), మిలన్‌ (ఇటలీ), ఆసియా పసిఫిక్‌, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌ తదితర 25 దేశాల్లో ప్రీమియం క్యాటరింగ్‌ ప్రాజెక్టులను చేపట్టిన అనుభవం తమకు ఉందన్నారు.