వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన సంచార వైద్య వాహనం ప్రారంభించిన మంత్రి 

నవతెలంగాణ- కంటేశ్వర్

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పభుత్వ సహకారంతో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన సంచార వైద్య వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ వాహనం అన్ని మండలాల్లో సంచరిస్తూ వృద్దులకు, ట్రాన్సజెండర్స్ కి తగిన పరీక్షలు చేపట్టి ఉచితంగా మందులు కూడా ఇస్తుందని పేర్కొన్నారు. వయో వృద్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నెలలో పది గ్రామాలకు ఈ వాహనం వస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి శంఖం పూరించిన తెలంగాణ ప్రభుత్వ సీ.ఎం కేసీఆర్ కి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే రెడ్ క్రాస్ చేపడుతున్న ఎన్నో సేవ కార్యక్రమాలను విజయవంతం చేసినట్టే ఈ వయోవృద్ధులకు ఉపయోగపడే కార్యక్రమం కూడా విజయవంతం చేయాలనీ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులుతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాదు అర్బన్ ఎం.ఎల్.ఏ బిగాల గణేష్ గుప్త, జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, మేయర్ నీతూ కిరణ్, జిల్లా పాలనిధికారి రాజీవ్ గాంధీ హన్మంతు, మహిళా సంక్షేమ అధికారిని, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, వైస్ చైర్మన్ డొల్ల రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, మారయ్య గౌడ్, సెక్రటరీ అరుణ్, ఈ.సి సభ్యుడు వెంకట కృష్ణ, ఎం.సి సభ్యుడు బాబా శ్రీనివాస్, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వరులు, పి.అర్.ఓ బొద్దుల రామకృష్ణ,  సిబ్బంది పాల్గొన్నారు.